Virat Kohli: విరాట్ కోహ్లీ వెంటే రికార్డులు..

Virat Kohli: విరాట్ కోహ్లీ వెంటే రికార్డులు..
విదేశాల్లో టెస్ట్ సెంచరీ(Test Cricket Century) కోసం నిన్నటి దాకా నాలుగున్నర యేళ్లు ఎదరుచూడాల్సి వచ్చింది. కోహ్లీ తన చివరి సెంచరీ 2018 సంవత్సరం డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై పెర్త్‌లో సెంచరీ(123) చేశాడు.

Virat Kohli: ఒకప్పుడు కోహ్లీ అత్యున్నత ఫాంలో ఉన్నపుడు కోహ్లీ ఆటను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయేవారు. ఫార్మాట్‌, మ్యాచ్ వేదికతో సంబంధం లేకుండా, సెంచరీలు, కీలక ఇన్నింగ్స్‌లతో అభిమానులకు ఆరాధ్య ఆటగాడయ్యాడు. కోహ్లీ సెంచరీ కొట్టాడు అంటే.. ఆ.. అది తెలిసిన విషయమే కదా అన్నంతగా ఫాం చూయించాడు. మధ్యలో కొన్ని రోజుల పాటు ఫాం కోల్పోయి తంటాపడ్డాడు.

విదేశాల్లో టెస్ట్ సెంచరీ(Test Cricket Century)కి నిన్నటి దాకా నాలుగున్నర యేళ్లు ఎదరుచూడాల్సి వచ్చింది. కోహ్లీ తన చివరి సెంచరీ 2018 సంవత్సరం డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై పెర్త్‌లో సెంచరీ(123) చేశాడు.


క్రికెట్ దిగ్గజం సచిన్ తర్వాత నంబర్ 3వ స్థానాన్ని భర్తీ చేసిన కోహ్లీ, ఆ స్థానంలో సచిన్‌ని అధిగమించేలా కొన్ని ఘనతలూ సాధించాడు. 500వ మ్యాచ్‌(500th Match)ల తర్వాత సచిన్‌ పేరిట టెస్టుల్లో 28 సెంచరీలు ఉండగా, 29వ సెంచరీతో కోహ్లీ సచిన్‌ని అధిగమించాడు. విదేశాల్లో సచిన్, కోహ్లీలు తమ 29వ సెంచరీని పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లోనే సాధించడం విశేషం.


తన అంతర్జాతీయ 500వ మ్యాచ్‌లో విండీస్‌పై బౌండరీతో సెంచరీ చేసి నాలుగున్నరేళ్ల తర్వాత విదేశాల్లో తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. దీంతో పాటే పలు రికార్డులూ, ఘనతలను తన పేరున లిఖించుకున్నాడు.

రికార్డులు ఇవే..

* 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

* భారత తరపున 500 మ్యాచులు ఆడిన ఆటగాళ్లలో సచిన్, మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni), రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid)ల తర్వాత 4వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలిచాడు.

* ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ఆటగాళ్ల(Active Players)లో అత్యధిక సెంచరీలు కోహ్లీవే. 76 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రసుత ఆటగాళ్లలో టెస్టుల్లో కోహ్లీ తర్వాత జో రూట్(Joe Root) 19 సెంచరీలతో 4వ స్థానంలో ఉన్నాడు.

*టెస్టుల్లో 29వ సెంచరీ చేసి అత్యధిక సెంచరీల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(Bradman) సరసన చేరాడు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాని అధిగమించాడు. సచిన్(44), జాక్వెస్ కలిస్(35), మహేలా జయవర్ధనే(30) ముందున్నారు.

*విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్(29) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

*టెస్టుల్లో 8676 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్‌(Virendra Sehwag)(8586)ని అధిగమించాడు. ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు.




Tags

Read MoreRead Less
Next Story