అకాయ్ కోహ్లీ".. ఈ పేరుకు అర్థం తెలుసా..!

అకాయ్ కోహ్లీ.. ఈ పేరుకు అర్థం తెలుసా..!

క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ - బ్యూటీ అనుష్క శర్మలు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. కొడుకు పుట్టినట్టు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అందరికీ తెలిపాడు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మకు వామిక అనే ఒక పాప ఉంది.

సోషల్ మీడియా వేదికగా తమ రెండో బిడ్డ, మొదటి కొడుకు పేరును కూడా అనౌన్స్ చేశారు ఈ లవబుల్ కపుల్. 'ఆ దేవుడి ఆశీస్సులతో బేబీ బాయ్ పుట్టాడు ..అనుష్క శర్మ బేబీ హ్యాపీగా ఉన్నారు. హెల్తీగా ఉన్నారు 'అంటూ చెప్పుకొచ్చాడు విరాట్. అంతేకాదు బేబీ పేరు 'అకాయ్' అంటూ రివిల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరో కింగ్ కోహ్లీ వచ్చాడు అంటూ విషెస్ అందిస్తున్నారు.

అకాయ్ అంటే అర్థం ఏంటి..? అంటూ సెర్చింగ్ చేస్తున్నారు. అకాయ్ అంటే అర్థం దృఢమైన శరీరం కలవాడు అని అర్థం. టర్కిష్ లో 'అకాయ్' అంటే ఉదయించే సూర్యుడు అనే మీనింగ్ ఉంది. అంతేకాదు అనుష్క శర్మలో 'అ' విరాట్ కోహ్లీ లో 'క' ని మిక్స్ చేస్తూ అకాయ్ అంటూ పెట్టారట. వామికలో కూడా వి, అనుష్కలో క ఉండటం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story