ఫైనల్‌‌లో రవికుమార్‌ దహియా ఓటమి...!

57 కేజీల ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్‌ ఫైనల్ లో భారత ఆశాకిరణం రవి కుమార్‌ దహియా.. ఓటమి పాలయ్యాడు.

ఫైనల్‌‌లో రవికుమార్‌ దహియా ఓటమి...!
X

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. 57 కేజీల ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్‌ ఫైనల్ లో భారత ఆశాకిరణం రవి కుమార్‌ దహియా.. ఓటమి పాలయ్యాడు. రష్యాకు చెందిన ప్రత్యర్థి జౌర్‌ ఉగుయేవ్‌కు గట్టి పోటీ ఇచ్చిన రవి.. పాయింట్లు సాధించడంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. దీంతో 4-7 తేడాతో రవి ఓటమి పాలై రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. వీరిద్దరూ గతంలో 2019 వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లోనూ పోటీపడ్డారు. అప్పుడు కూడా జౌర్‌ ఉగుయేవ్‌ విజేతగా నిలవగా... రవికుమార్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ మెడల్‌తో... ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. వీటిలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.

Also Read : ఆనాటి ఆ తండ్రి కష్టమే ఈ రవికుమార్ దాహియా.. కొడుకు కోసం 40కిలోమీటర్లు..!

Also Read :ఓడిపోతున్నానని చేయి కొరికాడు... 'ఇదేం పద్ధతి'?

Next Story

RELATED STORIES