IND-WI:మొదటి టెస్ట్ నేడే, ఓపెనర్‌గా యశస్వి, మ్యాచ్ ఎక్కడ చూడాలంటే..

IND-WI:మొదటి టెస్ట్ నేడే, ఓపెనర్‌గా యశస్వి, మ్యాచ్ ఎక్కడ చూడాలంటే..

వెస్టిండీస్‌తో బుధవారం నుంచి ప్రారంభమవనున్న మొదటి టెస్ట్‌లో ఐపీఎల్ సంచలనం యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా రానున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. జైశ్వాల్ ఓపెనర్‌గా, మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ 3వ స్థానంలో దిగనున్నారు. అయితే జైశ్వాల్‌ ఓపెనర్‌గా వస్తే, ఆ స్థానాన్ని త్యాగం చేసేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి టెస్ట్ సాయంత్రం 7.30గంటలకు ప్రారంభమవనుంది.

"మూడవ స్థానంలో ఆడాలనుకుంటున్నట్లు గిల్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు.దేశవాలీ క్రికెట్లో నంబర్ 3, 4 స్థానాల్లో రాణించినట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ఈ విషయంపై మాట్లాడాడు.దీంతో ఓపెనింగ్ జోడీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఓపెనింగ్ జోడీ రావడం కూడా మాకు కలిసొస్తుంది" అని రోహిత్ శర్మ అన్నాడు.



2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంతుల్లో పరుగులు చేసి సత్తా చాటాడు. ఇతర బ్యాట్స్‌మెన్ 50 బంతులు ఆడి వెనక్కి వస్తుండగా, కోచ్ రాహుల్ యశస్విని ఆడమంటూ కొనసాగించాడు.

"మేం చాలా కాలంగా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌ కోసం చూస్తున్నాం. యశస్వి జైస్వాల్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకుంటున్నాం" అని వెల్లడించాడు.

కోహ్లీ, కేఎల్ రాహుల ఫామ్ లేమితో భారత్ సతమవుతోంది. టెస్టుల్లో పుజారా చేపట్టిన కీలక బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌తో భర్తీ చేయాలని భారత జట్లు భావిస్తోంది. దీంతో యశస్వి ఓపెనర్‌గా, శుభ్మన్ 3వ స్థానంలో,4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో అజింక్య రహానేలు బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.

ఐపిఎల్‌లో జైశ్వాల్ 625 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు.. 15 ఫస్ట్ క్లాస్ టెస్టుల్లో 80.21 సగటుతో 9 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో 1,845 పరగులు సాధించాడు.

2 టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు ఆరంభమనుంది. జియో సినిమా, ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లు ఈ మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నాయి.


మొదటి టెస్ట్ జట్లు అంచనా

రోహిత్ శర్మ

యశస్వి జైస్వాల్

శుభమాన్ గిల్

విరాట్ కోహ్లీ

అజింక్య రహానే

KS భరత్/ఇషాన్ కిషన్

రవీంద్ర జడేజా/ అక్షర్ పటేల్

రవిచంద్రన్ అశ్విన్

శార్దూల్ ఠాకూర్

జయదేవ్ ఉనద్కత్

మహ్మద్ సిరాజ్



Tags

Read MoreRead Less
Next Story