Aus vs Eng: భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్, శతకంతో చెలరేగిన క్రాలే

Aus vs Eng: భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్, శతకంతో చెలరేగిన క్రాలే
ఇంగ్లాండ్ జట్టు 2వ సెషన్‌లో 7.12 రన్‌రేట్‌తో 25 ఓవర్లలో 178 పరుగులు చేశారు.

Ashes Test Enagland vs Australia: యాషెస్ 4వ టెస్ట్‌లో ఇంగ్లాండ్ ధాటిగా ఆడుతోంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి 384/4 పరుగులు చేసి 67 పరుగుల ఆధిక్యంలో సాధించింది. ఓపెనర్ జాక్ క్రాలే(189, 182 బంతులు, 21x4, 3x6) అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. జో రూట్(84), మొయిన్ అలీ(54)లు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగి టీ20 తరహాలో ఆడటంతో మొదటి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లకు 384 పరుగులు చేసి, భారీ స్కోర్ దిశగా సాగుతోంది. క్రీజులో హ్యారీ బ్రూక్(14), బెన్‌ స్టోక్స్(24) ఉన్నారు.


మొదటి ఇన్సింగ్స్ ఆరంభించిన క్రాలే మొదటి బంతికే బౌండరీకి తరలించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్‌ను కేవలం 1 పరుగుకే మిషెట్ స్టార్క్ వెనక్కి పంపాడు. 20 పరుగుల వద్ద రివ్యూతో ఎల్బీ వికెట్‌గా బతికిపోయిన క్రాలే ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. మొదట నెమ్మదిగా ఆరంభించిన మొయిన్ అలీ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. ఇద్దరూ కలిసి 4 కు పైగా రన్‌రేట్‌తో రన్స్ చేశారు. 49 పరుగుల వద్ద ఫోర్ కొట్టి జట్టు స్కోర్‌ను 100కు చేర్చడంతో పాటు, తానూ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం మొయిన్ అలీ కూడా అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 54 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన క్రాలే బౌండరీలతో వేగంగా పరుగులు చేశాడు. అర్ధసెంచరీకి 67 బంతులు ఆడిన క్రాలే, సెంచరీని మరో 26 బంతుల్లోనే అందుకోవడం విశేషం. 93 బంతుల్లో తన 4వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు.


జోరూట్‌తో కలిసి 33 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత సిక్సులు, బౌండరీలతో టీ20 తరహాలో ఆడారు. వీరి బ్యాటింగ్‌తో 2వ సెషన్‌లో 7.12 రన్‌రేట్‌తో 25 ఓవర్లలో 178 పరుగులు చేశారు. జోరూట్ కూడా 45 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారీ షాట్లతో ఆడుతూ ఎప్పుడు చేశాడో అన్నట్లుగా ఆడుతూ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్లకు ప్రయత్నించి కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో వికెట్ల మీదకు ఆడటంతో బౌల్డ్ అవడంతో ఆసీస్ బౌలర్లు ఉపశమనం పొందారు. మరో 4 ఓవర్ల తర్వాత జో రూట్‌ కూడా బౌల్డయ్యాడు. వీరిద్దరూ ఔటయిన తర్వాత స్కోర్ వేగం తగ్గినా, హ్యారీ బ్రూక్, బెన్‌స్టోక్‌లు మరో వికెట్ పడకుండా 2వ రోజుని ముగించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా, హేజిల్ వుడ్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు 299 పరుగులతో 2వ రోజు ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటి బంతికే పాట్ కమిన్స్ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 14 పరుగుల అనంతరం 10వ వికెట్ కోల్పోయి 317 పరుగులకు ఆలౌటయింది. క్రిస్ వోక్స్ 5 వికెట్ల మార్క్ సాధించాడు.

Tags

Read MoreRead Less
Next Story