Apple iPhone 15: ఆ దేశంలో చౌక ధరకే ఐఫోన్ 15

Apple iPhone 15: ఆ దేశంలో చౌక ధరకే ఐఫోన్ 15

కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ప్రధాన కార్యాలయం కలిగిన అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ యాపిల్. కొన్ని రోజుల క్రితం ఐఫోన్ 15 ధరలను విడుదల చేసింది. ఇది పన్నులు, దిగుమతి సుంకాల కారణంగా దేశం నుండి దేశానికి మారుతూ ఉంటుంది. కంపేర్‌డయల్, ఫోన్, సిమ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ను పోల్చి చూసే అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఐఫోన్ 15 చైనాలో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బేస్ మోడల్ iPhone 15 128GB ధర 825.22 డాలర్లు కాగా, అత్యంత ఖరీదైన మోడల్, iPhone 15 Pro Max 1TB ధర 1651.47 డాలర్లు.

ఐఫోన్ 15 అర్జెంటీనాలో అత్యంత ఖరీదైనది, iPhone 15 128GB ధర 2048.27 డాలర్లు కాగా.. iPhone 15 Pro Max 1TB ధర 4099.10డాలర్లుగా ఉంది.

ఐఫోన్ 15 తక్కువ ధర కలిగిన టాప్ 10 దేశాల జాబితా

Apple iPhone 15 తక్కువ ధర కలిగిన టాప్ 10 దేశాల జాబితా క్రింది విధంగా ఉంది:

చైనా (USD 825.22)

జపాన్ (USD 846.4)

USA (USD 849.73)

కెనడా (USD 917.88)

థాయిలాండ్ (USD 921.57)

UAE (USD 925.39)

ఖతార్ (USD 933.54)

తైవాన్ (USD 936.43)

మలేషియా (USD 939.96)

దక్షిణ కొరియా (USD 942.56)

వీటిలో చాలా దేశాలు ఆసియాలో ఉన్నాయి. ఈ జాబితాలో యూరోపియన్ దేశాలు లేవు.

భారతదేశంలో Apple iPhone 15 ధర..

భారతీయ కరెన్సీ పరంగా, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల డిస్ప్లే సైజులలో లభించే iPhone 15, iPhone 15 Plus వరుసగా రూ. 79,900, రూ. 89,900 నుండి ప్రారంభమవుతాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల డిస్ప్లే సైజులలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసగా రూ. 1,34,900, రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతాయి.

ఐఫోన్ 15 బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి, ఒక ఇండియన్ దేశ పౌరుల సగటు వార్షిక జీతంలో 38.6 శాతం ఖర్చు చేయాలి. అయితే, ధర పరంగా, ఐఫోన్ 15 ను కొనుగోలు చేసే ప్రపంచంలో అత్యంత తక్కువ ధర కలిగిన దేశాల్లో భారతదేశం 17వ స్థానంలో ఉంది.

Next Story