శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

చైనా కరోనా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు..

చైనా కరోనా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు..
X

చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు బ్రెజిల్ ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రం సావో పాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ చేపట్టింది. ఇందులో భాగంగా 9 వేల మంది వాలంటీర్లపై రెండు డోసులుగా కరోనా వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. అయితే ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురికాలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇక మూడో దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్‌ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది.

వ్యాక్సిన్‌ మొదటి డోసు తర్వాత ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల 20 శాతం మందిలో కాస్త నొప్పి వచ్చినట్లు సంస్థ తెలిపింది. 15 శాతం మందిలో తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రెండో డోసులో 10 శాతం మందికి మాత్రమే తలనొప్పి, 5 శాతం మందికి అలసట, వికారం, కొద్దిగా కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. ట్రయల్స్‌లో పాల్గొన్న 15వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయిన తరవాతే వైరస్‌ కట్టడిలో వ్యాక్సిన్‌ గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుటాంటన్ సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ వివరించింది.

Next Story

RELATED STORIES