Restrictions: కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం, ఎందుకంటే..

Restrictions: కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం, ఎందుకంటే..
గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్), ఈ మూడు వస్తువులతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం అధికం.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు,ట్యాబ్‌లపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కేవలం సక్రమంగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ ఉన్న దిగుమతులు అనుమతించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది.

విదేశీ ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వదేశంలోని ఉత్పత్తి రంగ సంస్థలకు తమ సామర్థ్యం మేరకు తయారీకి ఊతం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన దిగుమతి ఖర్చులు కూడా తగ్గనున్నాయి.

గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్), ఈ మూడు వస్తువులతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం అధికం.


దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాల ఉత్పత్తిని పెంచాలనే ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్‌కి కేంద్ర బిందువుగా మారాలనుకుంటున్న భారత ప్రభుత్వాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా తైవాన్, చైనాలే కేంద్రంగా ఉంటూ వస్తున్నాయి. ఇటీవల ఆయా దేశాల్లో రాజకీయ, ఇతర కారణాల వల్ల మెల్లమెల్లగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిశ్రమలను తరలిస్తున్నాయి.

కేంద్రప్రభుత్వ నిర్ణయంపై దేశీయ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

IT ఉత్పత్తుల అసోసియేష్ మాజీ డైరెక్టర్‌ జనరల్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికాడు. స్వదేశీ తయారీని ప్రోత్సహించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి కన్పిస్తోందన్నాడు. ఇది భారత తయారీ రంగానికి ఊతం ఇస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్లోబల్ కంపెనీలు డెల్, ఏసర్, శాంసంగ్, పానసోనిక్, యాపిల్, లెనోవో, హెచ్‌పీ వంటి వాటికి శరాఘాతం కానుంది. భారత్‌లో డిమాండ్‌గా తగ్గట్లుగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు చేస్తూ వాటి ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story