శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

పీఎస్‌ఎల్వీ సీ-49 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

పీఎస్‌ఎల్వీ సీ-49 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
X

మరో ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధమైంది. శనివారం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-49 ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రయోగం విజయవంతం కావాలంటూ.. తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్‌ నమూనాను ఉంచి శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపుతోంది. ముఖ్యంగా వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ముందుగా ఈ ప్రయోగాన్ని మార్చి 12నే నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది నిలిచిపోయింది. శనివారం ఈ ప్రయోగం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Next Story

RELATED STORIES