IT : ఐటీ కంపెనీల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి

IT : ఐటీ కంపెనీల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి
ఏడాది శిక్షణ తర్వాత సంవత్సరానికి ఆరున్న లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మూడున్నర లక్షలతో సరిపెట్టుకోమంటోంది

ఐటీ కంపెనీల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఏదో విధంగా ఖర్చు లు తగ్గించుకునేందుకు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో విప్రో కంపెనీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాది శిక్షణ తర్వాత సంవత్సరానికి ఆరున్న లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మూడున్నర లక్షలతో సరిపెట్టుకోమంటోంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌కు ఈ నెల 16న ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది.

అయితే ఖాళీగా ఉండే కంటే ముందు ఉద్యోగంలో చేరటమే బెస్ట్ అనుకున్న ఫ్రెషర్స్ కంపెనీ రూల్స్‌కి ఒప్పకున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వ్యాపార పరిస్థితులు మారిపోతున్నందున..ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదని విప్రో స్పష్టం చేసింది. కొత్త ఐటీ ప్రాజెక్టులపై సంతకాలు చేసేందుకు విదేశీ కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు తగ్గించడంతో పాటు ఉన్న ఉద్యోగుల్నీ మరింత సానపడుతున్నాయి. పనితీరు ఏ మాత్రం బాగోకపోయినా..ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇంటికి పంపుతున్నాయి. శిక్షణలో పనితీరు బాగోలేదనే పేరుతో విప్రో ఇటీవలే 600 మందికిపైగా ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపింది.

Tags

Read MoreRead Less
Next Story