వారి కోసం జియో అదిరిపోయే ఆఫర్..!

వారి కోసం జియో అదిరిపోయే ఆఫర్..!
Jio Prepaid Plans: రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

క్రికెట్ లవర్స్ కోసం రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్ 2021 విగతా మ్యాచులు తిరిగి సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ చెందిన ప్లాన్లను జియో ప్రారంభించింది. జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది. ఈ కొత్త రిలయన్స్ జియో ప్లాన్స్ లో డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర కంటెంట్ కొత్త లైబ్రరీ ఆస్వాదించవచ్చు.

ఇక ప్లాన్ రూ.499 రిచార్జ్ కింద జుకు 3జిబి డేటా అందిస్తుంది. ఇక మిగిలిన రూ.666, రూ.888, రూ.2,599 ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ అదనపు డేటా కావాలంటే యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రిచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. దీని కింద అన్ లిమిటెడ్ కాల్స్ కూడా పొందొచ్చు.

ఈ ప్లాన్ ధరలు ఇలా ఉన్నాయి.

రూ.499(28 రోజులు),

రూ.666(56 రోజులు),

రూ.888 (84 రోజులు),

రూ.2,599(365 రోజులు).

Tags

Read MoreRead Less
Next Story