శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

లావా బడ్జెట్ ఫోన్ లాంచ్.. రూ.7 వేలలోనే.. ఫీచర్లు ఇవే?

Lava Z2s: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా ఫోన్ లాంచ్ చేసింది.

Lava Latest Smart Phone
X

Lava Z2s

Lava Z2s: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా కొత్త రకం ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ రంగంలో వెనకబడిన లావా.. ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో లావా జెడ్2 సిరీస్‌లో ఇది మూడో ఫోన్ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో లావా జెడ్2, జెడ్2 మ్యాక్స్ ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. లావా జెడ్2ఎస్ అనే పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ధర రూ.7,299గా లావా నిర్ణయించింది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ 4జీ స్మార్ట్ ఫోన్ వర్క్ చేయనుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Lava Z2s

లావా జెడ్2ఎస్ స్పెసిఫికేషన్లు చూద్దాంః

- బ్యాటరీ సామర్థ్యం 5000 MAHగా ఉంది.

-6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే

- 2.5డీ కర్వ్‌డ్ స్క్రీన్‌

- ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం

-క్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌

Lava Z2s

- 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌

-మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ పెంచుకొనే సామార్థ్యం

- స్ట్రిప్డ్ బ్లూ కలర్‌ మాత్రమే ఉంది

-8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా

-5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

-190 గ్రాములు బరువు, 0.9 సెంటీమీటర్లు మందం

-యూఎస్‌బీ సీ-టైప్ పోర్టు వంటి కనెక్టివిటీ..ఓటీజీ సపోర్ట్

-వైఫై 802.11 b/g/n,

- 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5

ఈ ఫోన్ ధర రూ.7,299గా ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.7,099కే రానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.7,999కు లిస్ట్ అయింది. ఈ లిస్టింగ్‌ను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. రూ.6,700 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు తోపాటు.. రూ.334 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ప్రారంభం కానుంది.

Next Story

RELATED STORIES