Lunar Eclipse : నవంబర్ 19న ఆకాశంలో సుదీర్ఘమైన చంద్రగ్రహణం..!

Lunar Eclipse : నవంబర్ 19న ఆకాశంలో సుదీర్ఘమైన చంద్రగ్రహణం..!
Lunar Eclipse : ఆకాశం అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ శతాబ్ధంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహనం ఈ నెల 19న నింగిలో కనువిందు చేయనుంది.

Lunar Eclipse : ఆకాశం అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ శతాబ్ధంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహనం ఈ నెల 19న నింగిలో కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18,19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 19న శనివారం మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి..భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

3 గంటల 28 నిమిషాల పాటు ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ టైంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కానుందజి. ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున ఏర్పడింది. నిండు చంద్రుడు ఆరోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్, సూపర్ మూన్ అని పిలుస్తారు.

మన దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. అలాగే ఉత్తర అమెరికాలోని 50 దేశాలతో పాటు మెక్సికో వాళ్లు పూర్తిగా చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. అమెరికా తూర్పు తీరంలో తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకూ చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది.

కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని.. మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరద్ రుతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఈ పేరు వచ్చింది. శరద్ రుతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు దీనికి ఈ పేరు పెట్టాయి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణంలా అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది.

వచ్చే 80 సంవత్సరాలలో 2021, 2030 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది. 21వ శతాబ్దంలో 228 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాదికి ఇదే ఆఖరి కాగా చివరి చంద్ర గ్రహణం కాగా.. వచ్చే ఏడాది 2022, మే 15-16 తేదీల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

Tags

Read MoreRead Less
Next Story