ISRO-NASA: త్వరలోనే NISAR ఉపగ్రహం ప్రయోగం

ISRO-NASA: త్వరలోనే NISAR ఉపగ్రహం ప్రయోగం
వచ్చే సంవత్సరం ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.

నాసా(NASA)-ఇస్రో(ISRO)లు కలిసి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న నిసార్(NISAR) శాటిలైట్‌ను దాని తయారీకి చేసిన 2 ప్రధాన విడిభాగాల్ని కలిపి ఒకే ఎయిర్‌క్రాఫ్ట్‌గా రూపొందించారు. బెంగళూరులో దీనిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 2024 ఆరంభంలో లాంఛ్ చేయనున్నారు. ఈ శాటిలైట్ ద్వారా భూ భాగం, మంచు ఉపరితలాల్ని నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించగలుగుతుంది. 12 రోజుల్లో కనీసం ఒక్కసారైనా భూ గ్రహానికి సంబంధించిన ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంటుంది. దట్టమైన అడవులు, చిత్తడి నేలలు, వ్యవసాయ భూముల్లో వచ్చే మార్పులు వాటిపై శాస్త్రవేత్తల పరిశోధనలకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తుంది.


ఇది ఒక పెద్ద SUV కార్ అంత సైజులో ఉంటుంది. ఇందులో 2 రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. 4 అంగుళాల వేవ్‌లెంత్ ఉన్న S-బ్యాండ్ రాడార్ వ్యవసాయ క్షేత్రాల్ని, భూమి, మంచుపై గరుకుతలాల్ని పర్యవేక్షించనుండగా, 10-అంగుళాల వేవ్‌లెంగ్త్‌తో ఉన్న L-బ్యాండ్ రాడార్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో సైతం చొచ్చుకుపోయి వివరాలు అందించగలుగుతుంది. ఇవి రాత్రింబవళ్లు పనిచేస్తూ, దట్టమైన మేఘాల్లోంచి సైతం చొచ్చుకుపోయి కావాల్సిన సమాచారాన్ని సేకరించగలదు.

S-బ్యాండ్ రాడార్ అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో తయారైంది. తర్వాత L-బ్యాండ్ రాడార్‌ని తయారుచేస్తున్న అమెరికాలోని నాసా సెంటర్‌కి పంపగా అక్కడ ఈ రెండు వ్యవస్థల్ని పేలోడ్‌తో కలిపారు. మళ్లీ అక్కడి నుంచి బెంగళూరులోని UR రావ్ శాటిలైట్‌ కేంద్రానికి ఇప్పుడు తీసుకువచ్చారు.


ప్రస్తుతం నిసార్(NISAR) శాటిలైట్ పనితీరుని టెస్ట్ చేస్తున్నారు. లాంఛింగ్ సమయంలో ఎదురయ్యే అడ్డంకులు, భూ కక్ష్యలో ప్రవేశపెట్టాక ఎదురయ్యే సమస్యలను తట్టుకుని నిలబడేలా ఉండేట్లుగా దీనిని తయారుచేస్తున్నారు. దీనిని సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌కి తరలించి అక్కడ నుంచి లాంఛ్ చేయనున్నారు. ఈ ఉపగ్రహాన్ని భారత్ తయారుచేసిన GSLV-2 రాకెట్ ద్వారా ప్రయోగించి, భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

భూ పర్యవేక్షణ కోసం ఇరుదేశాల ప్రతిష్టాత్మక సంస్థలైన ఇండియ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేన్, నేషనల్ ఆస్ట్రోనాట్ అండ్ పర్ శాటిటైట్ ఏజెన్సీలు సంయుక్తంగా ఉపయోగ్రం ప్రయోగించాలనే ఒప్పందంలో భాగంగా నిసార్‌ని అభివృద్ధి చేస్తున్నారు. నాసా ఈ మిషన్‌కి అవసరమైన L-బ్యాండ్ రాడార్, రాడార్ రెఫ్లెక్టర్ యాంటెన్నా, బూమ్, కమ్యూనికేష్ సబ్ సిస్టం, జీపీఎస్ రిసీవర్స్, రికార్డర్, పేలోడ్ డేటా సబ్‌ సిస్టంను తయారుచేస్తోంది. ఇస్రో S-బ్యాండ్ రాడార్, స్పేస్ క్రాఫ్ట్ బస్, రాడార్ ఎలక్ట్రానిక్స్, లాంఛ్ వెహికల్స్, ఇతర లాంఛ్ వ్యవహారాల్ని తయారుచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story