శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

చంద్రుడిపై నీటి జాడలు.. 'నాసా' కీలక ప్రకటన

చంద్రుడిపై నీటి జాడలు.. నాసా కీలక ప్రకటన
X

చంద్రుడి నీటి జాడలపై జరుగుతున్న పరిశోధనల్లో.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - NASA కీలక ప్రకటన చేసింది. చందమామపై నీటి జాడలు కనుగొన్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు సూర్యుడి కాంతి పడని ప్రాంతాల్లో నీరు ఉన్నట్టు తేలినా... తాజాగా కొత్త సమాచారాన్ని ఇచ్చింది నాసా. చంద్రుడిపై సూర్యుడి కాంతి పడే ప్రదేశంలోనూ... నీరు ఉన్నట్టు నాసా గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లైయింగ్‌ అబ్జర్వేటర్‌ అయిన సోఫియా ద్వారా నాసా ఈ విషయాన్ని గుర్తించింది.

చంద్రుడి దక్షిణ ధృవంపై ఉండే క్లావియస్ లోయలో ఈ నీటిని గుర్తించింది సోఫియా అబ్జర్వేటరీ. చంద్రుడి దక్షిణ ధృవంలో ఇదే అతిపెద్ద లోయ. మనం భూమిపై నుంచి చూసినా ఇది కనిపిస్తుంది. ఆ నీరు ఓ చిన్న ఉల్కాపాతం వల్ల చంద్రుడిపై పడి ఉండవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. లేదా సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ పార్టికల్స్‌ వల్ల నీరు ఏర్పడి ఉంటుందని... అంచనా వేస్తున్నారు.

ఈ కొత్త పరిశోధనతో ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని విషయాన్ని నాసా తెలిపింది. ఇప్పటి వరకు చంద్రుడి చల్లని ప్రదేశాలు, నీడ ఉండే ప్రదేశాల్లో మాత్రమే నీరు ఉందని శాస్త్రవేత్తలు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఎండపడే ప్రాంతంలోనూ నీరు ఉందని తేలడం శుభపరిణామం అంటున్నారు. కొత్త పరిశోధనల తర్వాత వైపర్‌ అనే నీటిని పరిశోధించే రోవర్‌ను చంద్రుడిపై పంపాలని నాసా భావిస్తోంది. 2022 నాటికి అంది చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకునే అవకాశం ఉంది. చంద్రుడిపై కాలనీలు నిర్మించాలనే ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచనకు.. ఇప్పుడు మరింత ఊపు వచ్చినట్టైంది.

మరోవైపు... ఈ నెల 31న బ్లూ మూన్‌ కనిపించబోతోంది. అత్యంత ఎక్కువ కాంతితో... పెద్ద పరిమాణంలో చంద్రుడు కనిపించబోతున్నాడు. ఈ సారి వచ్చే బ్లూ మూన్‌ 76 ఏళ్ల కింద రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1944లో వచ్చింది. మళ్లీ అలాంటి అద్భుతం ఇప్పుడు ఆకాశంలో ఆవిష్కృతమవబోతోంది.

Next Story

RELATED STORIES