శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. నేడే విడుదల.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Ola Electric Scooter: ఓలా బైక్ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయనుంది

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. నేడే విడుదల.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
X

ఓలా బైక్ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయనుంది ఆ కంపెనీ. ఇక ఈ బైక్ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి బైక్‌పై ఆసక్తిని పెంచింది. కేవలం 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లు వచ్చాయంట. ఈ క్రేజ్‌తో పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారిలో మునిగిపోయాయి. ఇప్పటికే దిగ్గజ మోటర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్‌ ఈ రంగంలోకి ప్రవేశించింది. అసలు వాటి లీకైన ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..

-ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల దూరం

-'ఓలా స్కూటర్లు ముందుకే కాదు వెనుకకూ ప్రయాణించగలవు.

-స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌తో ఓలా స్కూటర్‌ను యాక్సెస్ చేయోచ్చు

-ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ పొడవు సుమారు 1,860 మిల్లీమీటర్ల

-వెడల్పు విషయానికి వస్తే 700 మిల్లీ మీటర్లు

-ఇక 1,155 మిల్లీ మీటర్లు ఎత్తు

-వీల్‌బేస్ 1,345 మిల్లీ మీటర్లు

-బరువు 74 కిలోలు

-బ్యాటరీ సామర్ధ్యం. ఓలా ఎలక్ట్రిక్ బైక్ 3.4kWh

ఎలక్ట్రిక్ బైక్ 4.5 సెకన్లలో గరిష్టంగా 45 కిలోమీటర్ల.. గంటకు వంద కిలోమీటర్ల వేగం ఉండొచ్చు

2019లో ఫేమ్‌-2 ఫథకం కింద మినిమం రేంజ్‌ 80 కిలోమీటర్లు, టాప్‌ స్పీడ్‌ 40కిలోమీటర్ల వేగం ఉన్న బైక్‌లకు మాత్రమే ఈ సబ్సీడీ అందనుంది. అయితే దీనిని సవరించింది. ప్రస్తుతం 50శాతం అంటే కిలో మీటర్‌ కేడబ్ల్యూహెచ్‌కి రూ.15వేలు ఇస్తున్నట‍్లు పేర్కొంది. అయితే, కేంద్ర అందించే ఈ సబ్సీడీ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌కు వర్తిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ధర పూర్తి వివరాలు తెలుస్తాయి.

Next Story

RELATED STORIES