శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

ప్రకృతిపై ప్లాస్టిక్ ప్రభావం.. పిల్లలలో ఆరోగ్య సమస్యలు.

impact of plastics: వాతావరణ కాలుష్యం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

ప్రకృతిపై ప్లాస్టిక్ ప్రభావం.. పిల్లలలో ఆరోగ్య సమస్యలు.
X

వాతావరణ కాలుష్యం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ప్రస్తుత కాలుష్య ప్రభావం చూస్తుంటే భూమిపైన మానవ మనుగడ అసాద్యమే అనిపిస్తుంది. మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుశ్యానికి సంబందించిన చిత్రాలు ప్రపంచాన్ని విస్మయపరుస్తున్నాయి. అయితే కాలుష్యానికి కారనమైన ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు దాని వినియోగ ప్రభావాలు కుడా చాలా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా పిల్లలపై దీని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరింత ఎక్కువగానే ఉందని చెప్పొచు.

అలెనా ఇన్‌స్టిట్యూట్ నుండి "BreakFreeFromPlastic" ఇంకా "చైల్డ్ అండ్ కన్స్యూమరిజం" అనే స్వచ్చంద సంస్థలు కలిసి "ప్లాస్టిసైజ్డ్ చైల్డ్హుడ్" పేరుతో వెబ్‌నార్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ 2020 జూలై 3న "ప్లాస్టిక్ పొల్యూషన్" కూటమి మేనేజింగ్ డైరెక్టర్ "జూలియా కోహెన్" ఆద్వర్యంలో జరింగింది. ప్రభుత్వేతర సంస్థ ఆర్నికా నుండి ప్లాస్టిక్ ఇంకా టాక్సిక్ రసాయనాలలో నిపుణుడైన "కరోలినా బ్రాబ్‌కోవ్" పిల్లలపై ప్లాస్టిక్ ప్రభావం గురించి వివ్వరిస్తూ.. ప్రస్తుత కాలలంలో వయోజనుల కంటే ఎక్కువగా పిల్లలు ప్లాస్టిక్ విషానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పుట్టకముందే పిల్లలను తీవ్రంగా ప్రభావితం చూపిస్తుందట.

పిండం, మెదడు అభివృద్ధి క్రమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లలో ప్లాస్టిక్‌లోని విషపూరిత సంకలనాల ప్రభావాన్ని వారి అధ్యయనాలు వివరించాయాట. "ప్లాస్టిసైజ్డ్ చైల్డ్హుడ్" నివేదిక పిల్లలపై ఆరోగ్యంపై ప్లాస్టిక్ బొమ్మల ప్రభావాలను తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 90% బొమ్మలు ప్లాస్టిక్ పదార్థాలతో.. ఇంకా ఎక్కువగా పాలీవినైల్ క్లోరైడ్ నుండి తయారయ్యే థాలెట్స్ అనే విషపూరిత పదార్ధం ద్వారా తాయారుచేయబడతాయి. ఈ విషపూరిత పదార్థాలు పిల్లలలో క్యాన్సర్ ఇంకా హార్మోన్ల సమస్యలను కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్, ఆడుకునే ప్లాస్టిక్ వస్తువల నుండి పిల్లలని దూరంగా ఉంచాలని హెచ్చరిస్తూ.. పిల్లల ఆరోగ్యాన్ని పకృతిని ప్లాస్టిక్ నుండి కాపాడుకోవాలని చెబుతున్నారు.Next Story

RELATED STORIES