Juno: భీతిగొలిపేలా ఉన్న గురు గ్రహం ఉత్తర ధ్రువం

Juno: భీతిగొలిపేలా ఉన్న గురు గ్రహం ఉత్తర ధ్రువం
నాసా విడుదల చేసిన ఆసక్తికర ఫొటో

2023, సెప్టెంబర్ 7న, నాసాకు చెందిన జూనో అంతరిక్ష నౌక 54వ సారి బృహస్పతి లేదా గురు గ్రహానికి చాలా దగ్గరగా వెళ్లింది.ఆ సందర్భంగా ఇది గురు గ్రహంపై ఒక విచిత్రమైన ముఖం ఆకారంలో ఉన్న చిత్రాన్ని తీసింది. జునో తాజాగా పంపిన ఫొటో బృహస్పతి ముఖాకృతి ఎంత భయానకంగా ఉందో చెబుతోంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గురు గ్రహంపై పరిశోధనల నిమిత్తం రోదసిలోకి జునో అనే స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. 2011లో రోదసిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక 2016లో గురు గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఫొటో గురు గ్రహం ఉత్తర ధ్రువానికి సంబంధించినది. ఒక భీకరమైన రాక్షస ముఖంగా గురు గ్రహం ఉత్తర ధ్రువం ఈ ఫొటోలో దర్శనమిస్తోంది. ఈ ఫొటోలో బృహస్పతిపై సగం చీకటి, సగం వెలుతురు ఉండడాన్ని చూడొచ్చు. అంతేకాదు, గురుగ్రహం ఉపరితలంపై భయంకరమైన తుపాను వలయాలు ఉన్నాయి. ఈ ఇమేజ్ చూసి శాస్త్రవేత్తలు కూడా షాక్‌ అయ్యారు. జెట్ N7 అని పిలిచే ఈ ఇమేజ్ బృహస్పతి యొక్క ఉత్తరాన కొంత భాగాన్ని చూపుతుంది. అక్కడ చాలా మేఘాలు, తుఫానులు ఏర్పడుతుంటాయి.ఆకాశంలో సూర్యుడు తక్కువ ఎత్తుకి వచ్చినప్పుడు అవి భిన్నంగా కనిపిస్తాయి. సూర్యుడు ఈ ప్రాంతం లక్షణాలను మరింత ప్రత్యేకంగా నిలిపేలా చేస్తాడు.ఇది బృహస్పతి వాతావరణం ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.


సూర్యకాంతి గురుగ్రహంపై పడే కోణం నుంచి ఈ ఫొటోను జునో క్లిక్ మనిపించింది. గురు గ్రహం కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ అంతరిక్ష నౌక ఇటీవల 54వ పర్యాయం గురుగ్రహానికి సమీపంలోకి వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ ఫొటోలోని అంశాలను విశ్లేషించే పనిలో పడ్డారు. జూనో చిత్రాన్ని తీసిన సమయంలో బృహస్పతికి 7,700 కిలోమీటర్ల దూరంలో ఉంది.జూనో ఉత్తర ధ్రువం ఎడమవైపు 69 డిగ్రీలు ఉన్న ప్రదేశంలో ఉందని, అది తీసిన చిత్రాన్ని పరేడోలియా అంటారని నాసా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story