భారత్‌కు చేరిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు.. వైరల్‌ అయిన వీడియోలు

భారత్‌కు చేరిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు.. వైరల్‌ అయిన వీడియోలు

కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకున్నాయి. హైదరాబాద్ చేరిన ఈ వ్యాక్సిన్ వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కాయి. త్వరలోనే ఈ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కరోనా నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ తెలిపాయి. దాదాపు 40వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన.. తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.

Tags

Read MoreRead Less
Next Story