ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్లొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి.

ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్లొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఇల్లు కొనాలి అన్న ఆలోచన రాగానే ఇంటి వేట ప్రారంభించాలి. బడ్జెట్ చూసుకుంటూ, అదే సమయంలో తక్కువలో వస్తున్నాయని తొందరపడకుండా ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి.

కరోనా వ్యాప్తి కాస్త సద్దుమణగడంతో ఇల్లు కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు నగర వాసులు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో లేదా కనీసం 30-40 శాతం నిర్మాణం పూర్తయిన వాటిల్లో కొనడం ఉత్తమం.

ఇల్లు కొనేముందు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దాం..

బిల్డర్ ట్రాక్ రికార్డ్డ్ చూడాలి. అంటే అతడు ఇంతకు ముందు నిర్మించిన ప్రాజెక్టులు ఎన్ని.. వాటి వివరాలు తెలుసుకోవాలి.

నిర్మాణ సంస్థ విలువలు ఏంటి? సాంకేతిక అనుభవం ఉందో లేదో చూడాలి.

కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏంటో ఆరా తీయాలి.

ప్రాజెక్ట్‌లో సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. క్యాష్ ఫ్లో ఎలా ఉంది కనుక్కోవాలి. బ్యాంక్ రుణాలు, కన్‌స్టక్షన్ ఫండింగ్ వివరాలు అడగాలి.

నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా తెలుసుకోవాలి.

ప్రాజెక్ట్ చుట్టూ వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి.

అన్నీ సరిగ్గా ఉన్నాయి అని అనుకున్నా ఓ సారి న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం.

ఏ ఏరియాల్లో ఎంత రేటు..

రూ.50 లక్షల లోపు ఇల్లు కావాలనుకుంటే ఉప్పల్, హయత్ నగర్, నాగార్జున సాగర్ హైవే, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో తీసుకోవచ్చు.

రూ.50 లక్షల నుంచి కోటి మధ్య అయితే మియాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి, శంషాబాద్, శంకర్ పల్లి, పటాన్ చెరు ప్రాంతాల్లో చూడొచ్చు.

కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, అప్పాజంక్షన్ ప్రాంతాల్లో అయితే కోటి పై మాటే.

కరోనా వచ్చి చాలా మందిని ఇంటికే పరిమితం చేసింది. ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య పెరిగింది. దాంతో ఇల్లు విశాలంగా ఉంటే బావుండు అనే భావన పెరిగింది. అందుకే ఇప్పుడు త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే లాక్టౌన్ వల్ల ఇంట్లో నాలుగు గోడల మధ్యనే 24 గంటలూ ఉండాలంటే కష్టం. కాస్త బడ్జెట్ అనుకూలంగా ఉంటే గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఆలోచిస్తే బెటర్. గాలి, వెలుతురుతో పాటు, అన్ని వసతులు అందులోనే ఉంటాయి. ఎప్పుడూ చుట్టూ నలుగురు మనుషులు కనిపిస్తుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story