దేశంలో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

దేశంలో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!
Electric Scooters: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు బండ్లు బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. అయితే పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇటీవలే ఓలా కూడా తన స్కూటీని మార్కెట్లోకి తెచ్చింది. దీంతో అనేక కంపెనీలు ఎలక్ట్రీక్ వాహనాలు తయారు చేసే పనిలో పడ్డాయి. ఈ సంవత్సరం చివరినాటికి కస్టమర్ల చేతికి అందనున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఉన్న ఈ వాహనాలు ఎంటో తెలుసుకుందామా..

ఓలా ఎస్1, ఎస్1 ప్రో

ఓలా రెండు వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న రూ.99,999(ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కంపెనీ బుకింగ్స్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

అథర్ 450ఎక్స్

అథర్ 450ఎక్స్ మార్కెట్లోకి తెచ్చింది. స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. అథర్ 450ఎక్స్ ధర రూ.1,44,500. ఈ స్కూటర్లో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది.


సింపుల్ వన్

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అగస్టు 15 నాడు లాంఛ్ చేసింది. బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. ఒరసారి చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది.


టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్

టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ఈ ఏడాది జూన్ లో లాంఛ్ చేసింది. అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర రూ.1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ రూ.1.44 లక్షలు. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story