శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

Ugadi 2021: ఆరు రుచుల ఆంతర్యం.. ఉగాది పచ్చడి వైశిష్ట్యం..!

ఉగాది పచ్చడిలో మిళితమైన ఆరు రుచులు.. ప్రతి మనిషి జీవితంలో జరిగే అనుభవాల ప్రతీక. అన్నీ కలిస్తేనే జీవితం. ఉగాది పచ్చడిలో అన్నీ కలిస్తేనే రుచి.

Ugadi 2021: ఆరు రుచుల ఆంతర్యం.. ఉగాది పచ్చడి వైశిష్ట్యం..!
X

ఉగాది పచ్చడిలో మిళితమైన ఆరు రుచులు.. ప్రతి మనిషి జీవితంలో జరిగే అనుభవాల ప్రతీక. అన్నీ కలిస్తేనే జీవితం. ఉగాది పచ్చడిలో అన్నీ కలిస్తేనే రుచి. సంతోషం వెనకే దుఖం ఉంటుంది. ఆనందాన్ని ఆస్వాదించాలి దుఖాన్ని భరించాలి. దేనికైనా అతిగా స్పందిస్తే అనర్థానికి దారి తీస్తుంది. పండగ నాడు పచ్చడిలో కూడా ఏ ఒక్కటీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటేనే రుచిగా ఉంటుంది.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.. ఈ ఆరు పదార్థాలు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సంయమనంతో స్వీకరించాలని పచ్చడి మనకు అంతర్లీనంగా తెలియజేస్తుంది. రుతువులు మారినప్పుడు శరీరంలో చోటు చేసుకున్న మార్పులను తట్టుకునేందుకు ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని అంటారు. ఉగాది పచ్చడిలో వేసే ఒక్కో పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక.

బెల్లం - ఆనందానికి సంకేతం

ఉప్పు - రుచికి

వేప పువ్వు - బాధ కలిగించే సంఘటనలు

చింతపండు- నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు

మామిడి ముక్కలు- కొత్త సవాళ్లను స్వీకరించడానికి

కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

ఇవన్నీ కలిపి తయారు చేసే పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ స్వీకరించాలి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. పండుగలకు, ఆచారాలకు గల సముచిత సంబంధాన్ని చాటి చెబుతుంది.

Next Story

RELATED STORIES