మెడికో ప్రీతి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్‌ సిద్ధం

మెడికో ప్రీతి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్‌ సిద్ధం
పోస్ట్‌మార్టం ఆధారంగా రూపొందించిన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను వరంగల్‌ పోలీసులకు అందజేసిన అధికారులు

మెడికో ప్రీతి మృతి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్‌ సిద్ధమైంది. గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన పోస్ట్‌మార్టం ఆధారంగా రూపొందించిన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను.. అధికారులు వరంగల్‌ పోలీసులకు అందజేశారు. ప్రీతిది హత్యా.. ఆత్మహత్యా అనే అనుమానాలకు ఈ రిపోర్ట్‌ తెరదించనుందని భావిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు.. ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు రెండో రోజు విచారించారు. ఏ ఏ ఆస్పత్రుల్లో కలిసి డ్యూటీ చేశారు అన్న కోణంలో విచారణ జరిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌లో..

సాయంత్రం హెడ్‌ క్వార్టర్‌లో సీపీ పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. సైఫ్‌ చెప్పిన విధంగా పోలీసులు డ్యూటీ లిస్ట్‌లను పరిశీలించారు. ఐతే.. తాను సీనియర్‌ను.. సీనియర్‌కు భయపడాలనే విధంగా చెప్పానే తప్ప.. ప్రీతిని వేధించలేదని సైఫ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story