పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల

పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల
తమపై షర్మిల చేయి చేసుకున్నారంటూ షర్మిల తీరుపై ఆగ్రహం

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై షర్మిల చేయి చేసుకున్నారంటూ షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ నివాసం నుంచి నిరుద్యోగ దీక్ష కోసం ధర్నా చౌక్‌కు బయల్దేరిన షర్మిలను.. పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించారు. దీంతో షర్మిల తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. షర్మిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌ క్రమంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story