విద్యార్థులకు ఉచిత వర్క్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌: మంత్రి సబితారెడ్డి

విద్యార్థులకు ఉచిత వర్క్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌: మంత్రి సబితారెడ్డి

తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్‌బుక్స్‌, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. విద్యా రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న గొప్ప నిర్ణయమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ పనితీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వర్క్‌బుక్స్‌, నోటు పుస్తకాలు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈసారి విద్యా సంవత్సరానికి 200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 150 కోట్ల వ్యయంతో యూనిఫామ్‌లు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.

జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అందులో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. వారి ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌ల పంపిణీ చేపట్టాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు పాఠశాలల్లో పండుగ వాతావరణం కల్పించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story