నగరంలో కల్తీ కలకలం

నగరంలో కల్తీ కలకలం
హైదరాబాద్ లో కల్తీ కేటుగాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. నగర శివారు ప్రాంతాలలో తిష్టవేసిన కల్తీ కంత్రీగాళ్లు పోలీసుల కళ్లుగప్పి, కల్తీ ఆహార పదర్థాలు తయారు

హైదరాబాద్ లో కల్తీ కేటుగాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. నగర శివారు ప్రాంతాలలో తిష్టవేసిన కల్తీ కంత్రీగాళ్లు పోలీసుల కళ్లుగప్పి, కల్తీ ఆహార పదర్థాలు తయారు చేస్తున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ ఈస్ట్ గాంధీనగర్ లో కల్తీ అల్లం పేస్టులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసారు పోలీసులు. ధాన్యాల పేస్టులో జంతన్ గాం కలిపి కల్తీ అల్లం పేస్టును తయారు చేస్తున్నారు. గాటు కోసం రసాయనాలను సైతం కలుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కల్తీ వ్యాపారం చేస్తున్న గోపాల్, వెంకటేషన్ ను అదుపులోకి తీసుకున్నారు. 168 కిలోల అల్లం పేస్టుతో పాటు, 60కిలోల రేషన్ బియ్యం, 30కిలోల ధాన్యాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story