చిత్రపురిలో అక్రమ కట్టడాలు కూల్చివేత

చిత్రపురిలో అక్రమ కట్టడాలు కూల్చివేత
అక్రమ కట్టడాలపై అధికారుల ఉక్కుపాదం మోపారు మణికొండ మున్సిపల్‌ అధికారులు. చిత్రపురిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు మణికొండ మున్సిపల్‌ అధికారులు. చిత్రపురిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ జేసీబీతో నిర్మాణాలను కూల్చేశారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోక పోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులతో భవన యజమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో చిత్రపురి కాలనీతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story