సీఎం కేసీఆర్‌ ఖమ్మాన్ని సీతాకోక చిలుకలా మార్చారు: మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్‌ ఖమ్మాన్ని సీతాకోక చిలుకలా మార్చారు: మంత్రి పువ్వాడ
గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీఎం కేసీఆర్‌ సీతాకోక చిలుకలా మార్చారన్నారు మంత్రి పువ్వాడ

గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీఎం కేసీఆర్‌ సీతాకోక చిలుకలా మార్చారన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్. ఖమ్మంలో వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేందుకు వన్‌ టౌన్‌, టూ టౌన్‌లో సైకిల్‌పై పర్యటించారు పువ్వాడ. కొత్త బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో టాయిలెట్స్‌ను పరిశీలించారు. బస్టాండ్‌ నిర్వాహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్.

ప్రతి రోజు కూరగాయల వ్యర్ధాలను ఆలస్యంగా తొలగిస్తున్నారని, వ్యాపారులు, రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన మంత్రి మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నగర పాలక పార్కులో వాకర్లతో ముచ్చటించారు మంత్రి పువ్వాడ. పార్కులు, ఓపెన్ జిమ్‌లు పరిశీలించారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో క్షేత్రస్ధాయిలో పర్యటన చేస్తున్నామన్నారు. తాగు నీటి సమస్యను పూర్తిగా అధిగమించామని, మురుగు నీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. త్వరలో 23కిలో మీటర్ల మేర అండర్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్.

Tags

Read MoreRead Less
Next Story