కిట్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు

కిట్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు
డ్రైవర్ లేకుండా వెళ్లే వాహనాలను ఎప్పుడైనా చూశారా? అదీ కూడా డ్రైవర్ లేకుండా పొలం దున్నే ట్రాక్టర్‌ను ఎప్పుడైనా చూశారా

డ్రైవర్ లేకుండా వెళ్లే వాహనాలను ఎప్పుడైనా చూశారా? అదీ కూడా డ్రైవర్ లేకుండా పొలం దున్నే ట్రాక్టర్‌ను ఎప్పుడైనా చూశారా? వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ తెలంగాణ యువ ఇంజినీరింగ్‌లు చేసి చూపించారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రొఫెసర్ల సాయంతో సెల్‌ఫోన్‌ సాయంతో కంట్రోల్ చేస్తూ పొలం దున్నే ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. డ్రైవర్‌ లేకుండానే ట్రాక్టర్‌ను నడవటం చూసి అశ్యర్యపోయానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ మేధాశక్తితో తెలంగాణ యువ ఇంజినీరింగ్‌లు కొత్త ఆవిష్కరణను ప్రపంచానికి చాటి చూపించారని ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story