టీఎస్‌పీఎస్సీ నిందితులకు 14రోజుల రిమాండ్‌

టీఎస్‌పీఎస్సీ నిందితులకు 14రోజుల రిమాండ్‌
గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ప్రవీణ్ పై ఆరోపణలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ నిందితులకు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో 9మంది నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. అనంతరం నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు వీరిని పోలీసులు హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇదిలా ఉండగా ప్రవీన్‌ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ప్రవీణ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. రిజెక్ట్‌ అయిన వారికి రీ కరెక్షన్‌ పేరుతో ఉద్యోగాలకు పైరవీలు చేసినట్లు అనుమానం. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను ప్రవీణ్‌ పట్టించుకోకుండా పైరవీ, ఫేక్‌ ఐడీ కార్డుతో ఉద్యోగాలు ఇప్పించాడు. పలువురు మహిళలకు ఫేక్‌ ఐడీ కార్డులు సృష్టించాడనే ఆరోపణలు బయట పడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story