TS : రైతుబంధుపై కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి

TS : రైతుబంధుపై కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. రైతుబంధు ప్రారంభించి నేటితో ఐదుళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన రైతును గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 65వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. FAO సైతం రైతులకు ఉపయోగపడే పథకాలలో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం ఆనందంగా ఉన్నారు. ప్రతీ ఏడాది 10వేల 500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటివరకు రైతుభీమా పథకం కింద 4వేల 964 కోట్ల బీమా పరిహారం అందించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 5వేల 349 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ నిర్వహించినట్లు తెలిపారు. లక్షా 21వేల కోట్ల రూపాయలతో 671.22 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story