ద‌శాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష

ద‌శాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష

తెలంగాణ ద‌శాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష నిర్వహించారు. నూతన స‌చివాల‌యంలో చేపట్టిన ఈ సమీక్షకు మంత్రులతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయా శాఖ‌ల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిది.. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.. జూన్‌ 2న ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 21 రోజులపాటు జరగనున్నాయి.

అటు నిన్న మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.. ఇక జూన్‌ 2న నూతన సచివాలయంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.. జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవాలను ప్రారంభిస్తారు.. ఆయా శాఖలు సాధించిన విజయాలను చాటిచెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలను అధికారులు రూపొందించారు.

Tags

Read MoreRead Less
Next Story