PROJECTS: ఆరో తేదీన కాళేశ్వరం పరిశీలన

PROJECTS: ఆరో తేదీన కాళేశ్వరం పరిశీలన

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన..అన్ని అంశాలు పరిశీలించి, అధ్యయనం చేయడం సహా పగుళ్లకు కారణాలు విశ్లేషించి... తగిన సిఫారసులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ..కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ NDSA ఆదేశాలు జారీచేసింది. మరో ఐదుగురిని సభ్యులుగా నియమించింది. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్. పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ కమిటీలోసభ్యులుగా ఉన్నారు. NDSA టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.


మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై.. సమగ్ర అధ్యయనం, తనిఖీల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. NDSA కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి....... ప్రాజెక్ట్ డేటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమోరండా, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, బ్యారేజ్ ఇన్ స్పెక్షన్ రిపోర్ట్స్, మెటీరియల్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలను... పూర్తిగా పరిశీలించాలని సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా ఇతర అంశాలకు.... కారణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. 3 ఆనకట్టల విషయంలోతదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ.. సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ... 4 నెలలలోపు నివేదిక ఇవ్వాలని NDSA గడువు నిర్దేశించింది.


కాళేశ్వరం పరిశీలనకు ఈనెల 6న నిపుణుల కమిటీ రానుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని, ఇందుకు అన్నిరకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు తమ ప్రభుత్వం.......... ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ ఆనకట్టను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి.... నీటిని ఖాళీ చేయాలని చెప్పిందని గుర్తుచేశారు. తర్వాత సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన కమిటీ.. మేడిగడ్డలో ఉన్న సమస్యలే వాటిల్లోనూ ఉన్నాయని..... నీటిని ఖాళీ చేయాలని సూచించిందని చెప్పారు. అథారిటీ సూచన మేరకే ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తోందన్నారు. కానీ... భారాస రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో..... గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన భారాస నేతలు..... ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు..

Next Story