Vikarabad: ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత..

Vikarabad: ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత..
Vikarabad: వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

Vikarabad: వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కలుషిత నీటి వల్ల 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా గురుకులంలో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తుండగా 600 మంది విద్యార్థులు పరీక్షలు చేయించుకున్నారు. టైఫాయిడ్‌, జ్వరం, దగ్గు, జలుబు, చర్మ సంబంధిత వ్యాధులతో పలువురు బాధపడుతున్నట్లు గుర్తించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తీసుకెళ్లారు. గురుకులంలో అవసరాల కోసం వాడే నీరు.. చెరువు మధ్యలోని బోరుబావి నుంచి వస్తుంది. దాన్ని ఓ సంపులో స్టోరేజ్‌ చేస్తుండగా ఇటీవలి వర్షాలకు నీట మునిగింది. అపరిశుభ్రత ఏర్పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story