Top

తెలంగాణలో కొత్తగా 2 వేల 43 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50 వేల 634 పరీక్షలు నిర్వహించగా... 2 వేల 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఒక లక్షా 67..

తెలంగాణలో కొత్తగా 2 వేల 43 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50 వేల 634 పరీక్షలు నిర్వహించగా... 2 వేల 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఒక లక్షా 67 వేల 46కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజులో కరోనా 11 మంది చనిపోగా... రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు... ఒక వెయ్యి 16కి చేరాయి.

కరోనా నుంచి నిన్న ఒక్క రోజులో 18 వందల 2 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 35 వేల 357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24 వేల 81 మంది హోం ఐలోలేషన్‌లో ఉన్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 23 లక్షల 79 వేల 950 కరోనా శాంపిల్స్‌ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా GHMC పరిధిలో 314, రంగారెడ్డిలో 174, మేడ్చల్‌లో 144 కొత్త కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES