తెలంగాణ

TS Corona : తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు..!

TS Corona : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.

TS Corona : తెలంగాణలో భారీగా నమోదైన కరోనా  కేసులు..!
X

TS Corona : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,983 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,14,639కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 4,062కి చేరింది. ఇక కరోనా బారి నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1206 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.Next Story

RELATED STORIES