తెలంగాణ బీజేపీలో సైలెంట్ అయిన 4R

తెలంగాణ బీజేపీలో సైలెంట్ అయిన 4R
సీఎం కేసీఆర్‌ను ఎదిరించి మరీ సత్తా చూపించిన నేతలు ప్రస్తుతం మౌనం దాల్చారు.

తెలంగాణ బీజేపీలో ఆ నలుగురు ఆర్‌లు సైలెంట్ అయ్యారు.సీఎం కేసీఆర్‌ను ఎదిరించి మరీ సత్తా చూపించిన నేతలు ప్రస్తుతం మౌనం దాల్చారు. గతంలో బీజేపీని గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. అయితే ఆయన సస్పెన్షన్ ఎత్తి వేతపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందర్ రావు బీఆర్ఎస్ కోటను కొట్టిన నేతగా గుర్తింపు పొందారు.మరోసారి గెలుపు కోసం దుబ్బాక లోనే మకాం వేసిన ఆయన ఎందుకో తన స్పీడ్‌ను తగ్గించారన్న చర్చ నడుస్తోంది.

ఇక రాష్ట్రంలోనే సంచలన నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌ హుజూరాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆత్మగౌరవ నినాదంతో కేసీఆర్‌ ను ఎదురించి మరీ గెలిచారు. అయితే బీజేపీలో ఆయన ఉన్నత పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.పార్టీలో ఈటల చుట్టూ నెలకొన్న వివాదాలు నెకొనడంతో ప్రస్తుతం మౌనంగా ఉన్నారు ఈటల.ఇక మరో ఆర్ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన తరువాత నియోజకవర్గానికే పరిమితమైన ఆయన ఢిల్లీ వేదికగా పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్‌ స్కామ్‌లో

కవితను అరెస్ట్ చేయకపోతే పార్టీకే నష్టమని కామెంట్స్‌ చేశారు. ఆ తరువాత ఆయన ఎక్కడా బయటకు రాలేదు.తెలంగాణ బీజేపీలో నలుగురు ఆర్‌ ల మౌనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారి సైలెన్స్‌ వెనుక అదిష్టానం సూచనలా.? లేక వ్యూహమా..? అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story