700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కిషన్ రెడ్డి

700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కిషన్ రెడ్డి
వచ్చే 40 ఏళ్ల వరకూ ప్రయాణికుల రద్దీకి సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు

తెలంగాణ ప్రజలకు చాలా రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని ప్రతి హిందూవు ఎప్పుడో ఒకసారి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారని. వారి సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వరకూ వందే భారత్ రైలును మోడీ అంకితం చేశారని అన్నారు. 700 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను వచ్చే 40 ఏళ్ల వరకూ ప్రయాణికుల రద్దీకి సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ కు ఇప్పటి వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. MMTS- 2 ప్రాజెక్ట్ ఆగిందని. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదన్నారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోడీని అడిగి నిధులు తీసుకొచ్చామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story