హైదరాబాద్‌‌ను ముంచేసిన వాన... ఇళ్లు కూలి 9మంది దుర్మరణం

హైదరాబాద్‌‌ను ముంచేసిన వాన... ఇళ్లు కూలి 9మంది దుర్మరణం

భారీ వర్షాలు హైదరాబాద్‌ నగరంలో విలయాన్ని సృష్టిస్తున్నాయి.. పాతబస్తీలో ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.. కుండపోత వర్షాలకు చాంద్రాయణగుట్ట గౌస్‌నగర్‌ ప్రాంతంలో రెండు ఇళ్లు కూలిపోయాయి.. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. ఓ ఇంట్లో ఐదుగురు, మరో ఇంట్లో నలుగురు చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ గ్రానైట్‌ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడటంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. అటు ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. గ్రానైట్‌ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఎంపీ అసుద్దీన్‌ ఒవైసీ ఘటనా స్థలానికి వెళ్లారు.. సహాయక చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలను ఎంపీ ఓదార్చారు.

Tags

Read MoreRead Less
Next Story