పీటలపై పెళ్లిని ఆపేసిన వధువు.. పెళ్ళికొచ్చిన అమ్మాయితో వరుడి పెళ్లి!

పీటలపై పెళ్లిని ఆపేసిన వధువు.. పెళ్ళికొచ్చిన అమ్మాయితో వరుడి పెళ్లి!
సరిగ్గా వధువు మేడలో వరుడు తాళికట్టే సమయానికి పీటలపై పెళ్లి ఆగిపోయింది. అయితే ఆపింది పోలీసులే అయినా.. ఆపేలా చేసింది మాత్రం స్వయంగా పెళ్లికూతురే

సరిగ్గా వధువు మేడలో వరుడు తాళికట్టే సమయానికి పీటలపై పెళ్లి ఆగిపోయింది. అయితే ఆపింది పోలీసులే అయినా.. ఆపేలా చేసింది మాత్రం స్వయంగా పెళ్లికూతురే.. అవును.. ఈ వింత సంఘటన మహబూబాబాద్‌లో మరిపెడ పట్టణంలో చోటు చేసుకుంది. మరిపెడ మండలం గుండెపూడికి చెందిన ఓ యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ అయింది.

ఇక మరికొన్ని క్షణాల్లో తాళికట్టే సమయం వస్తుందనగా పెళ్లి మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లి ఆపాలని అన్నారు. ఇదే పెద్ద షాక్ అనుకుంటే పెళ్లికూతురే పోలీసులను పిలిపించి పెళ్లి అపించిందని తెలుసుకొని మరింత షాక్ అయ్యారు ఆ పెళ్లి పెద్దలు.. తానూ ఓ యువకుడిని ప్రేమించానని, ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేయాలని యువతి పెళ్లి మండపం నుంచే పోలీసులకు ఫోన్‌ చేసింది.

అయితే వెంటనే స్పందించిన పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. పెళ్లి కుమార్తెకు ఆమె తల్లిదండ్రులు, పెళ్లిపెద్దలు ఎంతో నచ్చజెప్పారు కానీ ఆ యువతి ఒప్పుకోలేదు. దీనితో ఆ పెళ్లి అక్కడితో ఆగిపోయింది. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్‌ కోసం ఆ యువతిని సఖి కేంద్రానికి తరలించారు. అయితే దీనిని అవమానకరంగా ఫీల్ అయిన వరుడి తల్లిదండ్రులు అదే పెళ్లికి వచ్చిన బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story