అమెరికాలో దారుణం.. దుండగుల చేతిలో హత్యకు గురైన హైదరాబాద్ వాసి

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ మొహినుద్దీన్‌ అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు..

అమెరికాలో దారుణం.. దుండగుల చేతిలో హత్యకు గురైన హైదరాబాద్ వాసి
X

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ మొహినుద్దీన్‌ అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. పాతబస్తీ చంచల్‌గూడాకు చెందిన 37 ఏళ్ల ఆరిఫ్‌.. గత పదేళ్లుగా జార్జియాలో నివాసం ఉంటున్నాడు. అక్కడే దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న ఆరిఫ్‌పై కొంత మంది దుండగులు కత్తితో దాడి చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు ఆరిఫ్. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హత్యపై జార్జియా పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న ఆరిఫ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అత్యవసర వీసాపై అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఆరిఫ్‌ భార్య ఫాతిమా. యూఎస్‌లో తమకు ఎవరు బంధువులు లేరని.. భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడకు వెళ్లేందుకు సాయం చేయాలని కోరారు. ఆరిఫ్ హత్యకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story

RELATED STORIES