Medigadda: మేడిగడ్డను పరిశీలించిన కేంద్ర బృందం

Medigadda: మేడిగడ్డను పరిశీలించిన కేంద్ర బృందం
వంతెన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర బృందం.... ఏం జరిగిదన్న దానిపై ఆరా

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన ప్రదేశాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజ్‌ను పరిశీలించింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు .నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం..వంతెన కుంగిన చోటు, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగుబాటుకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర బృందం..క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఉదయం బ్యారేజీకి చేరుకుని తొలుత వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది.


20వ పిల్లర్ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓ నిచ్చెన సాయంతో కిందకు దిగి..దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. తర్వాత వంతెన కుంగిన శనివారం రాత్రి ఏం జరిగిందనే అంశంపై కేంద్ర బృందంప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ బృందానికి కాళేశ్వరం ప్రాజెక్టు ENC నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులు పూర్తి వివరాలు తెలిపారు. మేడిగడ్డ వద్ద పరిశీలన పూర్తి చేసుకున్న బృందం మధ్యాహ్నం తర్వాత వెనుదిరిగింది.

ఒకటి, రెండు రోజుల్లోనే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగుబాటుకు గురైన అంశంపై కేంద్ర జల శక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మేడిగడ్డ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. రెండ్రోజుల క్రితం లక్ష్మీ బ్యారేజ్ వద్ద పనిచేసే నీటిపారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికాంత్మేడిగడ్డ ఘటనపై మహదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పియర్ కింద భారీ శబ్దం రావడంతో గుర్తు తెలియని నేరస్థులు ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారనే అనుమానాలున్నాయని, దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని AEE ఫిర్యాదులో కోరారు. AEE ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సెక్షన్ 3, ఐపీసీ 427 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story