తెలంగాణ

Nalgonda: నల్గొండ జిల్లా మోత్కూరులో మంచిదొంగ..

Nalgonda: దొంగలందు మంచి దొంగలు వేరయా అన్నట్లుగా నల్లగొండ జిల్లాలోనూ ఓ మంచి దొంగ ఉన్నాడు.

Nalgonda: నల్గొండ జిల్లా మోత్కూరులో మంచిదొంగ..
X

Nalgonda: దొంగలందు మంచి దొంగలు వేరయా అన్నట్లుగా నల్లగొండ జిల్లాలోనూ ఓ మంచి దొంగ ఉన్నాడు. అతడు దొంగిలించిన బైక్‌ను తన పని అయిపోయిన వెంటనే మళ్లీ యథాస్థానంలో పెట్టి.. దాని యజమానికి క్షమాపణ చెబుతూ లెటర్‌ కూడా రాశాడు. రామన్నపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నర్సింహ పనిమీద మోత్కూరు వచ్చారు. ఓ వైన్‌ షాప్‌ ముందు తన బండి నిలిపి.. దుకాణంలోకి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి బండి లేదు.

దీంతో ఆందోళనకు గురైన నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మరుసటి రోజు అదే వైన్స్‌ దగ్గరికి వచ్చి చూడగా.. బైక్‌ అక్కడే ఉంది. అంతేకాదు.. దానిపై ఓ చిన్న లెటర్‌ కూడా ఉంది. బాబాయ్‌ నేను ఇంటికిపోయి డబ్బులు తెచ్చేసరికి నువ్వు కనబడలేదు. అంతా తిరిగి చూశాను..బండి ఇంటికి తీసుకెళ్లి మళ్లీ తెచ్చి అక్కడే పెట్టాను. సారీ బాబాయ్‌ ఏమీ అనుకోవద్దు అంటూ అందులో రాశాడు. దొంగ మంచితనం చూసి నర్సింహతో పాటు పోలీసులు కూడా అశ్చర్యపోయారు.

Next Story

RELATED STORIES