Top

'నీకోసం ఎంతోమంది వస్తుంటే... నాకు నచ్చిన లీడర్ మోడీ అంటావేంటి?' : ప్రకాష్ రాజ్

నీకోసం ఎంతోమంది వస్తుంటే... నాకు నచ్చిన లీడర్ మోడీ అంటావేంటి? : ప్రకాష్ రాజ్
X

గ్రేటర్‌ పోరు నటుల మధ్య చిచ్చుపెట్టింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతునిస్తూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాన్ని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మెగా బ్రదర్‌ నాగబాబు కౌంటర్ ఇచ్చారు.. దీంతో ఎన్నడూ లేని విధంగా సినీ నటుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. సాధారనంగానే రాజకీయా పార్టీలపై ప్రత్యర్ధులు విమర్శలు సంధిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయాల్లో అనుభవంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి వలన తాను చాలా నిరాశ చెందానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఏ నాయకుడినైనా ప్రశ్నించే స్టామినా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్.. అలాంటి వ్యక్తి ఇవాళ బీజేపీ బుజాల మీద ఎందుకెక్కారని ప్రశ్నించారు. జనసేన పార్టీకోసం ఎంతోమంది వస్తుంటే నాకు నచ్చిన లీడర్ మోడీ అంటూ పవన్ కళ్యాణ్ వెళ్లిపోవడమేంటి అని అన్నారు. ఏపీలో మోదీ ఓట్ షేర్ ఎంత? పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ ఎంతో తెలుసుకోవాలని.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఇవాళ కాకపోతే.. రేపు కచ్చితంగా బలీయమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్.. అలాంటి వ్యక్తికి సడన్ గా ఏమైందో.. మోదీతో ఎందుకు వెళ్లారో అర్ధం కావడం లేదన్నారు ప్రకాష్ రాజ్.. 2014 మోదీ మంచివాడని.. ఆ తరువాత మోసం చేశారని.. మళ్ళీ ఇప్పుడు మోదీ.. జాతికి అవసరం అని పవన్ అనడంలో అర్ధమేమిటని ప్రశ్నిస్తూ.. ఇది ఊసరవెల్లి తనం కాదా అని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు కూడా ఘాటుగా స్పందించారు. ప్రతీ పనికిమాలినవాడు పవన్ కల్యాణ్‌ను విమర్శించడమేనని వ్యాఖ్యానించారు.. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విధంగా అన్నారు.. 'రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్‌ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్‌ రాజ్‌ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది.' అని నాగబాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES