అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ బ్యాంక్‌ లాకర్లను తెరవనున్న ఏసీబీ అధికారులు

అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ బ్యాంక్‌ లాకర్లను తెరవనున్న ఏసీబీ అధికారులు

భారీగా లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మెదక్ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్ ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన్ను గురువారం ఏసీబీ కార్యాలయానికి తీసుకుని రానున్నారు. ఈ కేసులో నగేష్‌తోపాటు ఆర్డీవో అరుణారెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌, జీవన్‌గౌడ్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నగేష్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో భూమి డాక్యుమెంట్లు, బినామి పేర్ల మీద ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు VRO, VRA పాత్రపైనా అధికారులు ఆరాతీసుకున్నారు. ఈ ఘటనలో ఆడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా ఈ అవినీతి తిమింగళాలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అరెస్ట్ చేసి ఐదుగురికీ గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. 112 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి NOC కోసం ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్ చేశారు నగేష్‌. మొదటగా రెండువిడతల్లో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన 72 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్‌కు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం బాధితుడు నుండి 8 ఖాళీ చెక్కులు తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నగేష్ బ్యాంక్ లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story