TAPPING CASE: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడిపై మరో కేసు

TAPPING CASE: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడిపై మరో కేసు
రాధాకిషన్‌రావుపై కిడ్నాప్‌ కేసు.... వ్యాపారవేత్త ఫిర్యాదు

మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, మరో 8 మందిపై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదైంది. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చదువుకుని ప్రపంచబ్యాంకులో పనిచేసిన తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్ ప్రారంభించిట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో 165 హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లలో సేవలు అందించామన్నారు. ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని, మిగతా డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. తాను ఒప్పుకోకపోడం వల్ల టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, SI మల్లిఖార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు.100కోట్ల తన కంపెనీని చంద్రశేఖర్ పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మీడియాకు, ఉన్నతాధికారులకు చెబితే వేరే పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని వెల్లడించారు. సీఐ గట్టుమల్లు, అతని బృందానికి 10లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రాధాకిషన్ అరెస్టు వార్తలు విని... ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాధాకిషన్ సహా 9మందిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదుచేశారు.


మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఓ పార్టీ డబ్బులను పోలీసు వాహనాల్లో తరలించిన విషయాన్ని నిందితులే అంగీకరించినట్టు సురేష్ తన ఫిర్యాదులో వివరించారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న సురేష్ ఈడీ దర్యాప్తు చేస్తే ట్యాపింగ్ లో ఉన్న అసలు నిందితులు ఎవరో తేలుతారని స్పష్టంచేశారు.

డీసీపీ రాధాకిషన్ రావుకు.. ఈనెల 12వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. ఈ ఉదయానికి రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియగా ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి. గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాధాకిషన్ రావుకు..... కోర్టు ఈనెల 12వరకు రిమాండ్ పొడిగించింది. ఏడు రోజుల కస్టడీలో ఆయన నుంచి రాబట్టిన అంశాలుఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా మారనున్నట్టు... పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసిన వ్యవహారం, ఎవరెవరివద్ద ఎంత నగదు సీజ్ చేశారు,ఎవరి ఆదేశాల మేరకు సీజ్ చేశారనే అంశాలపై రాధాకిషన్ రావు నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా మరింత మందికి నోటీసులిచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ కేసు విచారణ కోసం. ప్రభుత్వం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story