Asifabad : ఉపాధిహామీ కూలీలపై తేనెటీగల దాడి

Asifabad : ఉపాధిహామీ కూలీలపై తేనెటీగల దాడి

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామానికి చెందిన సుమారు 56 మంది కూలీలు పనులకు వెళ్లగా.. ఒక్కసారిగా వారిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడితో కూలీలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 10మందికి పైగా కూలీలకు గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో ముగ్గురికి ముఖంపై తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story