తెలంగాణ

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రేమజంటపై దాడి

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రేమజంటపై దాడి
X

నిర్మల్ జిల్లా భైంసాలో ఓ ప్రేమ జంటపై బంధువులు దాడికి పాల్పడ్డారు. డిగ్రీ పరీక్షలు రాసిన తర్వాత.. బైక్‌పై వెళుతున్న జంటను బిజ్జూర్ వద్ద వాహనంతో ఢికొట్టి దాడికి పాల్పడ్డారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న జంట మూడు నెలల క్రితం విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. అటు.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కోపంతో అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు తెలుస్తోంది. డిగ్రీ పరీక్షలు రాసిన తర్వాత వారిద్దరు కలిసి బైక్‌పై వెళుతుండగా... అమ్మాయి తరపున బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జంటను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES