ఎమ్మెల్యే ధర్మారెడ్డి గూండాలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు : బండి సంజయ్
వరంగల్ ఘటనలో 43 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

X
Vamshi Krishna2 Feb 2021 1:37 AM GMT
వరంగల్ ఘటనలో 43 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన గూండాలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమన్నారు బండి సంజయ్. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. వరంగల్ జిల్లా పోలీసులు శాంతిభద్రతలను రక్షించాల్సింది పోయి.. టీఆర్ఎస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్.
Next Story