తెలంగాణ

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ..!

బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు‌ బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay :  సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ..!
X

బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు‌ బహిరంగ లేఖ రాశారు. బీసీ బంధును రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బీసీలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడనాడాలని... బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టి దానికి చట్ట బద్ధత కల్పించాలని కోరారు. 46 బీసీ కులాల కోసం నిర్మిస్తామని చెప్పిన ఆత్మగౌరవ భవనాల జాడే లేదని విమర్శించిన సంజయ్‌... 3400 కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES